కడప జిల్లాలో దారుణం.. డబ్బుల కోసం తాత మర్డర్..!

by srinivas |   ( Updated:2025-01-04 09:00:50.0  )
కడప జిల్లాలో దారుణం.. డబ్బుల కోసం తాత మర్డర్..!
X

దిశ, వెబ్ డెస్క్: డబ్బుల కోసం తాతను హత్య చేసిన ఘటన కడప జిల్లా(Kadapa District)లో జరిగింది. శెట్టివారిపల్లికి చెందిన వీరారెడ్డి(VeeraReddy)కి మనవడు ఉన్నారు. అయితే మనవడు అప్పులు పాలయ్యారు. దీంతో అప్పులు తీర్చేందుకు తాత వీరారెడ్డిని మనవడు కొంతకాలంగా డబ్బులు అడుగుతున్నారు. ఇందుకు వీరారెడ్డి ఒప్పుకోవడంలేదు. గత నెల 6న వీరారెడ్డి, మనవడి మధ్య ఘర్షణ జరిగింది. మనవడు దాడి చేయడంతో వీరారెడ్డి మరణించారు.

అయితే ఎవరికీ అనుమానం రాకుండా తాత వీరారెడ్డి మృతిని మనవడు సాధారణ మరణంగా చిత్రీకరించారు. కుటుంబ సభ్యులు సైతం నమ్మి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తాత వీరారెడ్డిని చంపిన దృశ్యాలు స్థానిక సీసీ పుటేజ్‌లో రికార్డు అయ్యారు. వీటి ఆధారంగా తాత వీరారెడ్డిని మనవడు చంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకు రమేశ్ ఫిర్యాదు మేరకు అనుమానితులు ప్రతాప్ రెడ్డి, నరసింహరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శ్మశానంలో పూడ్చిపెట్టిన వీరారెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యుల నివేదిక అనంతరం వీరారెడ్డి హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.

Advertisement

Next Story