- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Nagavamsi: అలా చేయడానికి ప్రయత్నిద్దాం.. నాకు మీ అందరి సపోర్ట్ కావాలంటూ నాగవంశీ రిక్వెస్ట్

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaj). దీనిని బాబీ కొల్లి తెరకెక్కించగా.. బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఇక మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, నిర్మాత నాగవంశీ ఓ ట్వీట్ చేశారు. ‘‘ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద blockbuster success అవ్వడానికి ప్రయత్నిద్దాం మీ Naga Vamsi’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా ఆలోచనలో పడ్డారు. ఇంత సడెన్‌గా నాగవంశీ ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏంటో అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం.
— Naga Vamsi (@vamsi84) January 4, 2025
అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద blockbuster success అవ్వటానికి ప్రయత్నిద్దాం.
మీ
Naga Vamsi