CSK: ధోని బ్యాటింగ్ పై స్టార్ హీరో సీరియస్

by Veldandi saikiran |
CSK: ధోని బ్యాటింగ్ పై స్టార్ హీరో సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై ( Ms Dhoni ) తీవ్ర వ్యతిరేకత రోజుకు పెరుగుతోంది. ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025టోర్నమెంట్ మొదటి నుంచి... ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. ధోని బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందు.. వస్తే చెన్నై సూపర్ కింగ్స్ అవలీలగా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే మహేంద్రసింగ్ ధోని పై తమిళ హీరో అసహనం వ్యక్తం చేశాడు.

చెన్నై కెప్టెన్ గా ఇవాళ బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోనీ పై తమిళ సినీ హీరో విష్ణు విశాల్ ( vishnu vishal ) ఆగ్రహం వ్యక్తం చేశాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ ఎందుకు చేయడం అంటూ.. నిలదీశారు హీరో విష్ణు విశాల్. ఇదంతా ఓ సర్కస్ ఎలా ఉందని... గెలవాలంటే ఈ పద్ధతి మానుకోవాలని కోరారు. స్పోర్ట్స్ కంటే ఎవరు గొప్ప కాదని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇక హీరో విష్ణు విశాల్ చేసిన పోస్టుపై.. కొంత మంది అతనికి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.

ధోని టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావాలని కోరుతున్నారు. అప్పటి వరకు చెన్నై గెలిచే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. కాగా ఇవాళ కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా... ధోని టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రాలేదు. 9వ స్థానంలో బ్యాటింగ్ చేసి... అందరిని షాక్ నకు గురి చేశాడు. ఆ సమయంలో వచ్చి కూడా నాలుగు బంతులు ఆడి ఒకే ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు.



Next Story

Most Viewed