- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
S Jaishankar: కార్నెగీ గ్లోబల్ టెక్ సమ్మిట్ లో ప్రసంగించిన జైశంకర్

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా విధించే పన్నుల విషయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(S Jaishankar) మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన కార్నెగీ గ్లోబల్ టెక్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. అమెరికా ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకునే విధానాన్ని ప్రాథమికంగా మార్చుకుందని.. ప్రతి రంగంలోనూ దాని పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో అవి మరింత తీవ్రంగా ఉంటాయి. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో టెక్నాలజీ, టారిఫ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండటం ఒకటే అందుకు కారణం కాదన్నారు. దాంతోపాటు ఆ దేశ సాంకేతిక పురోగతి అత్యంత కీలకమన్నరు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నదనేది స్పష్ట చేశారు. అందుకే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA)కు, టెక్‌కు మధ్య సంబంధం ఉందన్నారు. 2016 నుంచి 2020 లోని ట్రంప్ మొదటి పాలనలో అది ఇంత స్పష్టంగా కనిపించలేదన్నారు. అలాగే చైనా స్థిరమైన ఎదుగుదలను ప్రస్తావించారు. యూరప్ లో నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులను పేర్కొన్నారు.
టెక్నాలజీ, టారీఫ్ ల మధ్య సంబంధం..
జైశంకర్ మాట్లాడుతూ.. ‘టెక్నాలజీ, టారీఫ్ ల మధ్య ఉన్న సంబంధాన్ని మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఈ భౌగోళిక, సాంకేతిక నేపథ్యంలో మనం ప్రపంచాన్ని ఎలా చూడాలి..? నేనైతే దీన్నొక అవకాశంగా చూస్తాను. ఈ మార్పుని టెక్నలజీ, టారీప్ ల గురించి మాట్లాడేటప్పుడు అమెరికా నుంచే ప్రారంభిస్తాం.’ అని అన్నారు. ఇకపోతే, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. టారిఫ్ విషయంలో ఆయన కఠినవైఖరిని అవలంభిస్తున్నారు. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనే కాకుండా, ప్రపంచ మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలోనే జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అమెరికా, చైనా పోటీపోటీగా ముందుకు దూసుకెళ్తున్నాయన్న జైశంకర్.. దేశ ఎదుగుదలలో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకమని చెప్పరు.