LPG prices : ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర తగ్గింపు.. రూ.1804కి చేరిన ప్రైస్

by vinod kumar |
LPG prices : ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర తగ్గింపు.. రూ.1804కి చేరిన ప్రైస్
X

దిశ, నేషనల్ బ్యూరో: కొత్త సంవత్సరం మొదటి రోజున పెట్రోలియం కంపెనీలు గ్యాస్ ధరను తగ్గించాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ (Commercial LPG) ధర రూ.14.50 తగ్గి రూ.1804కి చేరుకుంది. గతంలో ఈ గ్యాస్ సిలిండర్‌కి రూ.1818.50 ధర ఉండగా బుధవారం నుంచి కాస్త తగ్గింది. అయితే, 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. దీని ధర రూ. 803గా ఉంది. గతేడాది డిసెంబర్‌లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచారు. ఇండియన్ ఆయిల్ ప్రకారం 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 16.50 రూపాయలు పెరిగింది. ఇక, కోల్‌కతా (Kolkata)లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.16 తగ్గి రూ.1911కి చేరింది. ముంబై (Mumbai)లో రూ.1771 నుంచి రూ.1756కు తగ్గింది. చెన్నయ్‌లో రూ.1966గా ఉన్నాయి. అయితే ఈ నగరాలన్నింటిలో 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed