మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బజూకా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Hamsa |
మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బజూకా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటినిస్తున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి, డీనో డెన్నిస్ కాంబోతో రాబోతున్న తాజా చిత్రం ‘బజూకా’(Bazooka). యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో జగదీశ్, సిద్దార్థ్ భరతన్(Siddharth Bharathan), సన్నీ వేన్, షైన్ టామ్ చాకో, ఐశ్వర్య మీనన్(Iswarya Menon) వంటి వారు నటిస్తున్నారు. దీనికి మిథున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని సరేగమ, థియేట్రీ ఆఫ్ డ్రీమ్స్, యీ ఫిల్మ్స్(Yoodlee Films) బ్యానర్స్‌పై అబ్రహం(Abraham), రోహన్ దీప్ సింగ్(Rohan Deep Singh), కురియాకోస్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది కానీ విడుదలకు నోచుకోలేదు. వాయిదాలు పడుతూ వచ్చింది. తాజాగా, ‘బజూకా’ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అంతేకాకుండా మమ్ముట్టి పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన గుబురు గడ్డంతో, జుట్టును పిలక కట్టుకుని కుర్చీలో కూర్చొని కనిపించారు. ప్రస్తుతం మమ్ముట్టి డిఫరెంట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Advertisement

Next Story

Most Viewed