Terrible: వామ్మో.. ఒకే చోట 80 పాము పిల్లలు

by srinivas |
Terrible: వామ్మో.. ఒకే చోట 80 పాము పిల్లలు
X

దిశ, వెబ్ డెస్క్: ఒక పామును చూస్తేనే హడలిపోతాం. అలాంటి ఒకే చోట 80 పాము పిల్లలను చూస్తే ఎంకేమన్నా ఉందా గుండెలు ఆగిపోవడం ఖాయం. అదే పొదల్లోనే, ఖాళీ స్థలంలోనో పాములు కనిపించి ఉంటే కచ్చితంగా బిత్తర పోయే వాళ్లు. కానీ అటవీ శాఖ కార్యాలయంలో ఈ 80 పాము పిల్లలు కనిపించాయి. దీంతో ఆశ్చర్యంగా చూశారు.

ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం(Markapuram)లో జరిగింది. మార్కాపురం పట్టణ శివారు ప్రాంతంలో రెండు వారాల క్రితం రెండు పాములు(Two snakes) 120 గుడ్లు పెట్టాయి. దీంతో స్నేక్ కేచర్ నిరంజన్‌(Snake Catcher Niranjan)కు స్థానికులు సమాచారం అందించారు. ఈ మేరకు పాము గుడ్ల(Eggs)ను స్వాధీనం చేసుకున్న ఆయన అటవీ శాఖ(Forest Department) కార్యాలయంలో వేర్వేరు ఇసుక డబ్బాల్లో భద్రపరిచారు. కొద్దిరోజులకు 80 పాములు పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో పాము పిల్లల వీడియో వైరల్ అయింది.

Next Story

Most Viewed