రాజీవ్ వికాసం దరఖాస్తు దారులకు నెట్ వర్క్ లో సాంకేతిక ఇబ్బందులు..

by Sumithra |
రాజీవ్ వికాసం దరఖాస్తు దారులకు నెట్ వర్క్ లో సాంకేతిక ఇబ్బందులు..
X

దిశ, బయ్యారం : బయ్యారం మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఆసరా కల్పించేందుకు రాజీవ్ యువ వికాస్ పథకమును ప్రవేశపెట్టింది. ఈ పథకంలో లబ్ధి పొందేందుకు పలువురు బీసీ, ఓసీ, ఎస్టీ, సామాజిక వర్గాలకు సర్టిఫికెట్ మంజూరి కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమ సర్టిఫికెట్ల మంజూరి కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. రాజీవ్ యువ వికాస్ దరఖాస్తు ఆఖరి తేదీ ఏప్రిల్ 5వ తారీఖున చివరన కావడంతో, ఆదాయం సర్టిఫికెట్, ఓసీలో ఆర్దికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యుఎస్ మంజూరు కోసం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వ నెట్ సైట్, నెట్వర్క్ సాంకేతిక లోపంతో సరిగా పనిచేయకపోవడంతో బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఓసీ కులాల వారికి ఆదాయ ధ్రువీకరణ మంజూరి అయితేనే రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యుఎస్ మంజూరి అవుతుంది.

దీని పై తహశీల్దార్ బి.విజయను వివరణ కోరగా రాజీవ్ యువ వికాస్ దరఖాస్తు కోసం మండలం నుండి యువత నుండి వందల సంఖ్యలో దరఖాస్తు ఫారాలు వచ్చినట్లు తెలిపారు. వాటిని మా సిబ్బంది ఎంక్వయిరీ చేసి సర్టిఫికెట్ మంజూరి పనిలో ఉన్నారు. ప్రభుత్వ సైట్లో సాంకేతిక లోపంతో కొంత ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. దీంతో సర్టిఫికెట్లలో మంజూరి ఆలస్యం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

Next Story