‘నాలుగేళ్లు ఆగండి.. లెక్కలు తేల్చుతాం’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘నాలుగేళ్లు ఆగండి.. లెక్కలు తేల్చుతాం’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో 16 మంది వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నేత(YCP Leader) పేర్ని నాని(Perni Nani) ఆరోపించారు. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) మచిలిపట్నం సబ్ జైల్‌ల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను వైసీపీ నేత పేర్ని నాని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు సమక్షంలోనే టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని విద్వేష పూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారని మండిపడ్డారు. రాళ్లు కర్రలు విసిరేశారని తెలిపారు.

రాష్ట్రంలో పోలీసులు పసుపు పచ్చ కండువా వేసుకున్న వారిలా ఉద్యోగం చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరాయి, రౌడీ మూకలకు పోలీసులు వత్తాసు పలకడం అన్యాయమన్నారు. పెనుగంచిప్రోలు ఘటనలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాడం దారుణమని విమర్శించారు. టీడీపీ నేత(TDP Leaders)లపై ఎలాంటి కేసులు పెట్టలేదు. ఈ రాష్ట్రంలో చట్టం, ధర్మం, న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. చట్టాన్ని టీడీపీకి చుట్టంలా చేసిన పోలీసులను న్యాయం ముందు నిలబెడతాం అని ఆయన ఫైర్ అయ్యారు.

Next Story