- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రసవం తర్వాత పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడానికి కారణాలు.. ఎలా నివారించాలి?

దిశ, వెబ్‌డెస్క్: తల్లి కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే తల్లితో పాటు కుటుంబీకులు మొత్తం ఆనందంలో మునిగితేలుతారు. కానీ కొత్త తల్లికి అప్పుడే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. రాత్రంతా నిద్ర ఉండకపోవడం,హార్మోన్లలో మార్పులు కనిపిస్తుంటాయి. విపరీతమైన స్ట్రెస్ పెరుగుతుంది. కారణం లేకుండా చికాకు వస్తుంటుంది. ఒత్తిడి పెరిగి.. మానసిక ప్రశాంతతను కోల్పోతారు.
ముఖ్యంగా డెలివరీ తర్వాత చాలా మంది మహిళల్లో పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. కానీ ఈ విషయాన్ని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ నెలల తరబడి ఇలాగే కొనసాగితే మాత్రం వైద్యుల్ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ డెలివరీ తర్వాత కలిగే క్రమం లేని పీరియడ్స్‌కు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సమయానికి పీరియడ్స్ రాకపోవడానికి కారణాలు పిల్లలకు పాలివ్వడం ఒకటి. పిల్లలకు పాలిచ్చే క్రమంలో ప్రొలాక్టిన్ లెవల్స్ పై ప్రభావం చూపిస్తుంది. రీప్రొడక్టివ్ హార్మోన్లైన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు సమతుల్యతను కోల్పోతాయి. తద్వారా అండాలు విడుదలై తగ్గిపోతుంది.
అలాగే మహిళలు డెలివరీ తర్వాత బాడీలో సున్నితత్వం పెరిగిపోతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాగా మెదడులోని హార్మోన్లను అదుపు చేసే ప్రాంతమైన హైపతలమస్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది. స్ట్రెస్ పెరగడం వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరిగి కూడా పీరియడ్స్ వచ్చే సమయం మారిపోతుంది.
అలాగే గర్భాశయ పరిమాణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. డెలివరీ అనంతరం మహిళల శరీరంలో ఉండే పోషకాలన్నీ పోతాయి. కాల్షియం, ఐరన్, విటమిన్ డి తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు లోపిస్తాయి. తద్వారా అండాల విడుదలలో ఆలస్యానికి కారణమవుతాయి.అలాగే అకస్మాత్తుగా వెయిట్ లాస్ అవ్వడం, పెరగడం వంటివి జరుగుతాయి.
మరీ ఈ పరిస్థితి కంట్రోల్‌లో ఉండాలంటే.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి శ్వాస సంబంధిత వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయాలి. కాగా హార్మోన్ లెవల్స్ లో స్థిరత్వం కలుగుతుంది. అలాగే నిద్రపోవడానికి ప్రయత్నించండి.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.