స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి..

by Kalyani |   ( Updated:2025-03-22 12:52:09.0  )
స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి..
X

దిశ, పాపన్నపేట : స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రం పాపన్నపేటలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట ఏసు (30) పశువుల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈనెల 20న పశువులను మేపేందుకు గ్రామ శివారులోకి వెళ్లాడు. రాత్రికి పశువులు వచ్చినా ఏసు తిరిగి రాలేదు. చుట్టూ పక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. శనివారం పాత చెరువు వద్ద ఏసు దుస్తులు, చెప్పులు కనిపించడంతో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. స్నానానికి వెళ్లిన ఏసు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed