- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

దిశ, జడ్చర్ల : రాజాపూర్ కస్తూర్బా పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని టాబ్లెట్ మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకెళితే 9వ తరగతి విద్యార్థులు వైష్ణవి అనే విద్యార్థిని కొట్టడంతో పాటు పాఠశాల సిబ్బంది అసభ్యకర పదజాలంతో దూషించారన్నారు. దీంతో పాటు పాఠశాలలో ఉండకూడదని హుకుం జారీ చేయడంతోనే మనస్థాపం చెంది తన వద్ద ఉన్న మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందన్నారు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియజేయకుండా గోప్యంగా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎనిమిదో తరగతి చదువుతున్న వైష్ణవి పాఠశాల పై భవనంలో వంటగదిలోకి వెళ్లి అక్కడ ఉన్న మరమరాలు తినడాన్ని చూసిన తొమ్మిదో తరగతి విద్యార్థులు దూషిస్తూ వైష్ణవి పై దాడి చేసి కొట్టారని తెలిపారు. ఈ విషయాన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న మరో టీచర్కు తెలపడంతో ఆమె విద్యార్థినిని దూషిస్తూ వైష్ణవి తల్లికి ఫోన్ చేసి మీ కూతుర్ని పాఠశాల నుండి వెంబడే తీసుకువెళ్లాలని పాఠశాలలో ఉండాల్సిన అవసరం లేదని హుకుం జారీ చేసిందని విద్యార్థిని తెలిపారు. జిల్లా అధికారులకు పాఠశాల సిబ్బంది ఈ విషయం తెలపకపోవడంతో విద్యార్థి సంఘం నాయకులు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించడంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జిల్లా అధికారులకు పురమాయించారు. దీంతో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి జీసీడీఓ రాధా చేరుకొని విద్యార్థినిని ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.