- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anasuya: అతను పైకి వచ్చి ఉంటే అదే జరిగేది.. నెటిజన్‌కు కౌంటర్ ఇచ్చిన అనసూయ.. అసలేం జరిగిందంటే?

దిశ, సినిమా: టాలీవుడ్ నటి అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్ధస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ఆమె యాంకర్‌గా వ్యవహరించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే పలు షోలు చేసి కొద్ది కాలంపాలు బుల్లితెరను షేక్ చేసిందనడంతో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనసూయ ఎన్నో మూవీస్ చేసి స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల అనసూయ ‘పుష్ప-2’ (pushpa-2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఓ వైపు చిత్రాల్లో నటిస్తూనే ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.
అలాగే పలు పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక ఎవరైనా తనను ఏమైనా అంటే మాత్రం ఊరుకోదు వారికి తగ్గట్లు సమాధానమిస్తోంది. పలు వివాదాస్పద పోస్ట్‌లతో అనసూయ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో చిట్ చాట్ చేసిన ఈ హాట్ యాంకర్ ఓ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఆమె ఓ వ్యక్తికి మిడిల్ ఫింగర్ చూపించడంపై వివరణ ఇస్తూ వీడియో విడుదల చేసింది. ‘‘నాకు ముందు కోపం రాలేదు. ఇది అగౌరపరిచిన సంఘటన కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది.
కామెంట్ల రూపంలో ముక్కు మొహం తెలియకుండా ఏదైనా టైప్ చేయడం.. ఏదైనా మాట్లాడటం ఒక ఎత్తు. కానీ నా ఎదురుగగా ఉండి నా ముఖం మీద నన్ను ఏజ్ షేమ్ చేయాలనుకున్నా.. నన్ను అగౌరపరచాలనుకున్నా వారికి అట్లా చెప్పాల్సి వచ్చింది. నేనే కాదు ఏ అమ్మాయిని ఏ వ్యక్తఅయినా ఇది తప్పు కాదని చెప్పాలని అనుకున్నా అంతే. అలా చేయడం తప్పని చెప్పడం నా ఉద్దేశం. పైకి వస్తే ఏం చేసేదానిని అంటే ఏం జరిగేది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఎవరికి ఏ బాషలో అర్థమవుతుందో ఆ బాషలోనే చెప్పాలి. నేను అదే చేస్తున్నాను. ఇది ట్రూ ట్రాఫిక్ బ్రో’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టంట వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.