పుస్తక పఠనంతో ఎన్నో ప్రయోజనాలు

by Sridhar Babu |
పుస్తక పఠనంతో ఎన్నో ప్రయోజనాలు
X

దిశ, ఆదిలాబాద్ : పుస్తక పఠనంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అవి చదవడం వల్ల ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చు అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. శనివారం వివేక జాగృతి ఆధ్వర్యంలో స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన బుక్స్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాల్ లో ఉన్న పుస్తకాలను పరిశీలించి వాటిని చదివారు.

స్వామి వివేకానంద ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగారని విద్యార్థులకు సూచించారు. అంత గొప్ప వ్యక్తి ఆలోచనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. స్వామి వివేకానంద జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, శ్రీకృష్ణ సేవా సమితి నాయకులు, పాఠశాల ప్రిన్సిపాల్ దేవేందర్ పటాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed