- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పిల్లలు మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలంటే తల్లిదండ్రులు చేయాల్సినవివే?
దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటేనే ఏదైనా సాధించగలం అనే నమ్మకం వారిలో ఏర్పడుతుంది. కానీ ఇటీవల చాలా మంది పిల్లలు ఒత్తిడి పలు కారణాలతో మానసికంగా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నారు. కాగా పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా పెరిగేందుకు నిపుణులు చెప్పిన పలు సూచనలు చూద్దాం..
కమ్యూనికేషన్: పిల్లలతో తల్లితండ్రులు తరచూ మాట్లాడుతూ ఉండాలి. వారి సమస్యల్ని అడిగి తెలుసుకోండి. దీంతో వారిలోని భయాన్ని, ఒత్తిడి తగ్గిపోతుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
సమాజంపై అవగాహన: మీ పిల్లలకు సామాజిక నైపుణ్యాలు నేర్పించాలి. ఇతరులతో ఎలా మాట్లాడాలి? ఎలాంటి వారిలో స్నేహం చేయాలి? అనే విషయాలు చెప్పాలి. ఎదుటివారి మనోభావాలు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం వంటివి నేర్పించాలి.
సరైన నిద్ర, డైట్: పెద్దల కైనా, పిల్లలకైనా సరైన సమయానికి మంచి నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా పోకపోతే ఒత్తిడి పెరిగిపోయి.. మానసికంగా బాధపడుతుంటారు. కాగా నాణ్యమైన ఆహారం, మంచి నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ప్రేమ, అనుబంధం: పిల్లల పట్ల ప్రేమ చూపించాలి. వారు అడిగిన వస్తువుల్ని.. అవసరమైనవి కొనివ్వాలి. అంతేకాకుండా పిల్లలపై సానుభూతి చూపిస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే పిల్లలపై అరవకూడదు. తప్పు చేస్తే ఆ తప్పును వివరించి వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
యోగా-ధ్యానం: పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయాలి. ఇవి పిల్లల్లోని ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. సరైన ఆహారం తీసుకోవాలి.
స్ఫూర్తిదాయకమైన కథలు: తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేరేపించే మాటలు మాట్లాడాలి. మీరు ఏదైనా చేయగలరు అనే నమ్మకం వారిలో తీసుకోవాలి. కాగా పిల్లలక స్ఫూర్తిదాయకమైన, శక్తివంతమైన కథలు చెప్పాలి. ఇవి పిల్లల్లో నమ్మకం, ధైర్యాన్ని తీసుకొస్తాయి.
అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం: అలాగే పిల్లల్ని తరచూ చదువుపైనే దృష్టి పెట్టాలని ఫోర్స్ చేయకుండా కాసేపు ఆడుకోనివ్వండి. ఎక్కువగా సృజనాత్మకమైన ఆటల్లో పాల్గొనమని చెప్పండి. ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల గోల్ ఏంటో అడిగి తెలుసుకోండి. వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వండి.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.