ప్రమాదాల నివారణలో వాహనదారులే కీలకపాత్ర పోషించాలి

by Sridhar Babu |
ప్రమాదాల నివారణలో వాహనదారులే కీలకపాత్ర పోషించాలి
X

దిశ, ఆదిలాబాద్ : రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, వాటి నివారణలో వాహనదారులే కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ అందజేసి బైక్ ర్యాలీని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాహనదారులు ట్రాఫిక్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ సీఐ, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story