Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’ మూవీ ట్రైలర్ విడుదల.. ప్రధాని పాత్రలో యాక్టింగ్ అదరగొట్టిన కంగనా

by Hamsa |   ( Updated:2025-01-06 11:25:51.0  )
Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’ మూవీ ట్రైలర్ విడుదల.. ప్రధాని పాత్రలో యాక్టింగ్ అదరగొట్టిన కంగనా
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) రాజకీయాలతో పాటు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఇందులో అనుపమ్ ఖేర్(Anupam Kher), మహిమా చౌదరి, మిలింద్ సోమన్(Milind Soman), శ్రేయాస్ తల్పాడే వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

దీనిని జీ స్టూడియోస్(Zee Studios), మణికర్ణిక ఫిలిమ్స్(Manikarnika Films) బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఎమర్జెన్సీ’ మూవీ గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. ఓ వ్యక్తి అడ్డుకోవడం వల్ల విడుదల వాయిదా పడింది. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లగా.. కొద్ది రోజులకు సద్దుమనగడంతో విడుదలకు సిద్ధమైంది.

ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎమర్జెన్సీ’ జనవరి 17న థియేటర్స్‌లోకా రానున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇందిరా గాంధీ పాత్రలో నటించి అదరగొట్టింది. ఇందులో 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించిన సమయంలో భారత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూపించి అందరినీ కట్టిపడేశారు. కంగనా అద్భుతమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.


Advertisement

Next Story