- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హాస్పిటల్ బెడ్‌పై నాగార్జున హీరోయిన్.. ఇది చాలా క్రూషియల్ టైమ్ అంటూ ఎమోషనల్ పోస్ట్

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ అన్షు అంబానీ(Anshu Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అక్కినేని నాగార్జున(Nagarjuna) నటించిన ‘మన్మధుడు’(Manmadhudu) సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే మొదటి మూవీతో అన్షు అంబానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో తన అందం, నటన, మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది. ‘మన్మధుడు’ హిట్ కావడంతో అన్షుకు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ మూవీ హిట్ కాలేదు. ఈ క్రమంలోనే అన్షు అంబాని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయింది. తన కుటుంబంతో లండన్‌లో సెటిల్ అయిపోయింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఈ భామ సినీ పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్(Sandeep Kishan) నటించిన ‘మజాకా’(Mazaka) మూవీలో కీలక పాత్రలో కనిపించింది.
త్రినాథ రావు నక్కిన (Trinadha Rao Nakkina)దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రితూ వర్మ(Rithu Verma) హీరోయిన్‌గా నటించగా.. రావు రమేష్(Rao Ramesh) కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండ(Rajesh Danda) నిర్మించారు. భారీ అంచనాల మధ్య ‘మజాకా’ ఫిబ్రవరి 26న శివరాత్రి కానుకగా థియేటర్స్‌లోకి వచ్చింది. కానీ హిట్ సాధించలేకపోయింది. అయితే ప్రమోషన్స్‌లో అన్షు అంబాని తెగ కష్టపడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె మళ్లీ లండన్ చెక్కేసింది. అయితే ‘మజాకా’మూవీ సమయంలో అన్షు గాయంతో కనిపించిన విషయం తెలిసిందే. దీంతో అంతా ఆమెకు ఏమైందో తెలియక తెగ కంగారు పడిపోయారు. సోషల్ మీడియా ద్వారా ఏమైందని అంతా అన్షును ప్రశ్నించారు.
తాజాగా, ఈ విషయంపై ఈ అమ్మడు స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ఇది కెమెరాల కోసం కాదు, ఇది స్క్రిప్ట్ కాదు. ఇది నిజమైన గాయం.. ఒక నెల క్రితం జీవితం చాలా కీలకమైన సమయంలో ఊహించని సవాలును నా వైపు విసిరింది. కానీ నా కుటుంబం, సన్నిహితులు, పరిశ్రమ శ్రేయోభిలాషుల ప్రేమతో, నేను నయం అవుతున్నాను. మచ్చలు నన్ను నిర్వచించవు. నా బలం, సంకల్పం నన్ను నిర్వచించాయి. తిరిగి రావడం ఎల్లప్పుడూ ఎదురుదెబ్బ కంటే బలంగా ఉంటుంది. నన్ను నమ్మండి, నేను ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో తిరిగి వస్తున్నాను. ఇది చాలా క్రూషియల్ టైమ్’’ అని రాసుకొచ్చింది. అలాగే హాస్పిటల్ బెడ్‌పై చికిత్స్ తీసుకున్న వీడియోను షేర్ చేసింది. ఇక అన్షు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అది చూసిన నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
Read More..