11 ఏళ్లకే ఆ రంగంలో దూసుకెళ్తున్న బాలుడు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే?

by Jakkula Mamatha |
11 ఏళ్లకే ఆ రంగంలో దూసుకెళ్తున్న బాలుడు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)కి చెందిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకెళ్ల టెక్నాలజీ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను(Minister Nara Lokesh) అఖిల్ ఆకెళ్ల(Akhil Akella) కలుసుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు. యూకేలో విద్యను అభ్యసిస్తున్న 11 ఏళ్ల అఖిల్.. చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు.

ఈ రంగంలో ఎన్నో మైలురాళ్లను సాధించాడు. మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా, సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషన్లు పొందాడు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్‌లలో పాల్గొన్నాడు. అమరావతిలో జరగనున్న సమాచార, సాంకేతిక అభివృద్ధి(Technological development)లో భాగస్వామ్యం అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో త్వరలోనే కలుస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్‌ను కలుసుకున్నారు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్‌ను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని మంత్రి అన్నారు.

Next Story

Most Viewed