తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి సీఎం రేవంత్ రెడ్డే : మెదక్ ఎంపీ

by Aamani |
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి సీఎం రేవంత్ రెడ్డే : మెదక్ ఎంపీ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి సీఎం రేవంత్ రెడ్డే అని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని 16, 31 ,32 వార్డుల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గావ్ చలో.. బస్తీ చలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరించి కరపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రేషన్ బియ్యం, గ్యాస్ సబ్సిడీ పేదలకు అందించే మందులు ఇలా అన్నింటిలోనూ కేంద్రం వాటా ఉందన్నారు.

సన్న బియ్యం మేమే ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు బియ్యం వాటాలో కేంద్రం సొమ్ము అవసరం లేదని చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చిట్టచివరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని భవిష్యత్తులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ సహకారం అయ్యే రోజులు మరి ఎంతో దూరంలో లేవని, దేశం మొత్తం కాషాయ రెపరెపలు ఖాయమన్నారు. పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరించేందుకే గావ్ చలో.. బస్తీ చలో.. అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. హెచ్ సీ యూ భూముల వ్యవహారంలో ఎవరున్నారో దమ్ముంటే బయట పెట్టాలని సవాల్ చేశారు.

ప్రతి సందర్భంలోనూ ఆధిపత్యం కోసం అల్లాడుతున్న కేసీఆర్ కుటుంబ సభ్యులైన హరీష్ రావు, కేటీఆర్, కవితలను మీడియా బహిష్కరించాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి మూడేళ్లకోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ఉంటుందని అధ్యక్షుడు ఎవరైనా సుశిక్షితు లైన కార్యకర్తల లాగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కోడూరు నరేష్, కొత్తపల్లి వేణుగోపాల్, చింత సంతోష్, మాజీ కౌన్సిలర్ బాసంగారి వెంకట్, నాయకులు కార్తీక్, ముచ్చర్ల నాగరాజు, శ్రీకాంత్, యాదగిరి, దాబా నరేష్, తొడుపునూరి వెంకటేశం, వెంకట్, మూల రాజిరెడ్డి, ఉప్పెన శశి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed