Rajesh: పాస్టర్ ప్రవీణ్ మృతి.. పోలీసులపై మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు

by Shiva |
Rajesh: పాస్టర్ ప్రవీణ్ మృతి.. పోలీసులపై మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల (Praveen Pagadala) అనుమానాస్పద మృతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన మృతిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలంటూ అటు క్రైస్తవ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ మృతిపై పోలీసుల తీరు పట్ల మహాసేన రాజేశ్ (Mahasena Rajesh) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రవీణ్ పగడాల మృతి పట్ల పోలీసులు బాధ్యతారహిత్యంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే క్రైమ్ సీన్‌ (Crime Scene)ను పోలీసులు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు.

ప్రవీణ్‌ది హత్య కాదు.. యాక్సిండెంట్ అంటూ కొందరు పోలీసులు మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు సమాచారం ఇవ్వడం బాధకరమని అన్నారు. అలాంటి వారికి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే.. వారిని తప్పుదోవ పట్టించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ విషమంలో పోలీసులు ఈ విషయంలో అనవసరంగా తమతో డబుల్ గేమ్స్ ఆడుతున్నారని.. ఇవాళ సాయంత్రంలోపు కేసులో అన్ని నిజాలను బయటపెట్టాలని రాజేశ్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed