- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral video: ఏంటి జవాన్లు రైఫిల్ ఇలా క్లిన్ చేస్తారా?.. ఆశ్చర్యంలో నెటిజన్లు!

దిశ, వెబ్ డెస్క్: దేశ రక్షణే లక్ష్యంగా ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. ఎండ, వాన, చలిని.. లెక్కచేయకుండా మాతృభూమిని శత్రువుల దాడి నుంచి కాపాడేందుకు తమ ప్రాణాలను సైత్యం త్యాగం చేస్తుంటారు. సోషల్ మీడియాలో జవాన్లకు సంబంధించిన అనేక వీడియోలు కూడా వైరల్ అవ్వటం చూస్తుంటాం. తాజాగా నెట్టింట ఓ జవాన్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్న రేకుల గదిలో వంట సామాగ్రి, పొయ్యి ఉన్నాయి. వాటి పక్కనే ఒక జవాన్ (Jawan) రైఫిల్ (Rifle) పట్టుకుని నిల్చున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఆ జవాన్ తన రైఫిల్‌ను పొయ్యిపై పెట్టిన ప్రెజర్ కుక్కర్ ఫిజిల్ మోత స్థానంలో ఉంచాడు. ఇక రైఫిల్ నుంచి కుక్కర్‌లోని ఆవిరి బయటికి వస్తుంది. ఈ వీడియోను రైఫిల్‌ను ప్రెజర్ కుక్కర్ మోతగా వాడిన జవాన్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే, జవాన్లు సాధారణంగా రైఫిల్‌ను ఈ విధంగానే శుభ్రపరుస్తారని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా, మొదటిసారి చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
తన రైఫిల్ ను కుక్కర్ ప్రెషర్ మోతగా వాడిన జవాన్ వీడియో వైరల్.#ViralVideo #UANow pic.twitter.com/WVgET81Tnr
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 27, 2025