ఎయిర్ పోర్ట్‌లోనే ఆ పని చేసిన తెలుగు నటి.. నెటిజన్లు ఫైర్ (వీడియో)

by Hamsa |   ( Updated:2025-03-25 04:38:14.0  )
ఎయిర్ పోర్ట్‌లోనే ఆ పని చేసిన తెలుగు నటి.. నెటిజన్లు ఫైర్ (వీడియో)
X

దిశ, సినిమా: ప్రముఖ నటి మన్నారా చోప్రా(Mannara Chopra) ‘జక్కన్న’(Jakkanna) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తిక్క (thikka), రోగ్, సీత వంటి చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇక అక్కడ కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్న మన్నారా చోప్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మన్నారా చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తుండగా.. ఆమెను విమానం ఎక్కకుండా సిబ్బంది అడ్డుకున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ మన్నారా చోప్రా సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘ఉదయం నేను ముంబై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చినప్పటికీ జైపూర్‌కు వెళ్లే విమానంలో ఎక్కేందుకు అనుమతి నిరాకరించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నాపై ఫైర్ అయ్యారు. నేను అక్కడే ఉన్నప్పటికీ నా పేరు పిలువలేదు.

నేను బోర్డింగ్ గేట్ ముందే కూర్చున్నాను అయినా నా పేరును ప్రకటించకపోవడంతో విమానం ఎక్కలేకపోయాను. అసలు విషయం తెలుసుకున్నాక సిబ్బందిని అడిగితే నాతో దురుసుగా ప్రవర్తించారు. అసలు ఈ ప్రవర్తన ఏంటి? విమానం షెడ్యూల్ సమయానికి 15 నిమిషాల ముందే బయలుదేరింది. ఢిల్లీ విమానాశ్రయంలో అదే విమానయాన సంస్థతో ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నాను’’ అని ఎయిర్‌పోర్ట్‌లో అరుస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం బహిరంగ ప్రదేశంలో గొడవ సృష్టించి ఇతరులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని విమర్శిస్తున్నారు.

Read More..

హాస్పిటల్ బెడ్‌పై నాగార్జున హీరోయిన్.. ఇది చాలా క్రూషియల్ టైమ్ అంటూ ఎమోషనల్ పోస్ట్

Advertisement
Next Story

Most Viewed