CM Chandrababu: నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు.. అసలు విషయం ఇదే!

by Shiva |
CM Chandrababu: నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ చెన్నైకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన అడయార్‌లోని ‘మద్రాస్‌ ఐఐటీ’లో ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్- AIRSS 2025‌లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో చెన్నైకి వెళ్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు అక్కడి టీడీపీ (TDP) శ్రేణులు, అభిమానులు సన్నద్ధమవుతున్నారు. మీనంబాక్కంలోని పాత విమానాశ్రయంలో వీఐటీ గేట్ నుంచి సీఎం చంద్రబాబు నేరుగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌కు చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్‌లో పాల్గొని అక్కడ కార్యక్రమం ముగిసిన వెంటనే సాయంత్రం 4 గంటలకు తిరిగి అదే ఫ్లైట్‌లో విజయవాడకు చేరుకోనున్నారు.

Next Story

Most Viewed