- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీ..

దిశ, జగిత్యాల రూరల్: శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నిన్న రాత్రి ఒంటి గంట సమయంలో,జిల్లా ఎస్పీ జగిత్యాల పట్టణంలో పెట్రోలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.అర్ధరాత్రి సమయంలో సమర్థవంతమైన పెట్రోలింగ్ ద్వారా ప్రజలో భద్రత భావం ను పెంపొందించడం జిల్లా పోలీసుల లక్ష్యం అని రాత్రి సమయంలో నిఘా మరింత పటిష్టం చేస్తూ సమయానుకూల చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నేరాలను నియంత్రించవచ్చు అన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ గురించి పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం పరచడం జరిగిందని దీని ద్వారా జిల్లాలోని ప్రజలు ప్రశాంతం ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అన్నారు.