ఆ విషయంలో కేటీఆర్ సవాల్ విసరడం సిగ్గుచేటు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి ఫైర్

by Ramesh Goud |
ఆ విషయంలో కేటీఆర్ సవాల్ విసరడం సిగ్గుచేటు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) సవాల్ విసరడం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Congress MLC Addanki Dayakar) మండిపడ్డారు. రుణమాఫీ (Loan Vaiwer) అంశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అద్దంకి.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్ల కాలంలో లక్ష లోపు రుణమాఫీ చేయలేకపోయారని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని బతిలాడుకొని చేసిన రుణమాఫీ లక్షలోపు అయ్యి ఉంటే, తాము 2023 లో చేసిన 9 వేల కోట్ల పై చిలుకు రుణమాఫీ లక్ష లోపు ఎలా ఉంటాయో కేటీఆర్ ఆలోచన చేయాలని అన్నారు.

ఒకే ఏడాదిలో రైతు రుణమాఫీ కోసం మా ప్రభుత్వం రూ.21 వేల కోట్లు ఖర్చు చేసిందని, బీఆర్ఎస్ (BRS) హామీ ఇచ్చిన రైతు బంధు (Raithu Bandu) కోసం 10 వేల కోట్లు.. రైతు భరోసా (Raithu Bharosa) కోసం మరో 10 వేల కోట్లు.. కేవలం ఒక్క ఏడాదిలో రైతుల కోసం 40 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. మళ్లీ దీనిపై వంద శాతం ఎక్కడ అయ్యింది.. ఎక్కడికి పోదాం అని సవాళ్లు విసరడానికి కేటీఆర్ కు సిగ్గు అనిపించడం లేదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల కష్టాలను చూసి రేవంత్ రెడ్డి (Revath Reddy) చేసిన దాన్ని జీర్ణించుకోలేక రైతు సమాజం నుంచి వ్యతిరేకత రావడానికి కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంలోకి నెట్టి, 7 లక్షల కోట్ల అప్పులు చేసి రైతులను విధ్వంసంలోకి నెట్టిన కాలం బీఆర్ఎస్ పరిపాలన (BRS Governance) కాలమని, త్వరలోనే అన్నీ లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. సవాళ్లు విసరడం కాదని, తొమ్మిదిన్నర ఏళ్లలో రైతులకు మీరు చేసినది ఏంది, 13 నెలల కాలంలో తాము చేసినది ఏంది బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. సభలో ఇష్టానుసారంగా అబద్దాలు చెప్పి, టీఆర్పీలు (TRPs) పెంచుకునే ప్రయత్నాలను ఎవరూ హర్షించరని చెప్పారు. రైతు సమాజాన్ని ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని (Congress Government), ఇకపై మీరు రాష్ట్రం గురించి, అప్పుల గురించి మాట్లాడితే ప్రజలు పట్టించుకోరనేది గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నేత (Congress Leader) సూచించారు.

Next Story

Most Viewed