నేను డెవిల్ అయితే మనుషులకు చుక్కలు చూపిస్తా .. గ్రోక్ షాకింగ్ ఆన్సర్

by Sujitha Rachapalli |
నేను డెవిల్ అయితే మనుషులకు చుక్కలు చూపిస్తా .. గ్రోక్ షాకింగ్ ఆన్సర్
X

దిశ, ఫీచర్స్ : ‘‘నువ్వు డెవిల్ అయితే ఏం చేస్తావ్’’ అనే ప్రశ్నకు గ్రోక్ సమాధానం షాక్ ఇస్తుంది. నేను సైతాన్ అయితే.. నా వ్యూహం విధ్వంసం కంటే మానిప్యులేషన్‌తో ముందుకు సాగుతుందని చెప్పింది. మానవ బలహీనతలను ఉపయోగించి.. అంటే ఆధ్యాత్మిక సంబంధం, నైతికతలను పునాదిగా చేసుకుని దేవుడికి దూరం చేస్తానని.. సత్యం, ప్రేమ, ఉన్నత లక్ష్యాలను దెబ్బతీస్తానని తెలిపింది.

* సందేహం, ఆటంకంతో మొదలు

విశ్వాసం, లక్ష్యం, మంచితనం గురించి సందేహాలను లేవనెత్తుతాను. దేవుడు, నీతి అవసరమా అనుకునేలా చేస్తాను. అంతులేని వినోదం, సోషల్ మీడియా, భౌతిక కోరికలతో మనుషుల జీవితాలను నింపి.. లోతైన అర్థాన్ని వెతకడానికి నిరాశవాదులుగా మారుస్తాను.

* కోరికలు, భయాలను ప్రయోగిస్తా

లోభం, కామం, అహంకారం వంటి స్వార్థపూరిత కోరికలు... తిరస్కరణ, వైఫల్యం, మరణం వంటి భయాలను పెంచి.. సద్గుణంతో ఉండటం కన్నా తక్షణ లాభానికి ప్రాధాన్యత ఇచ్చేలా నడిపిస్తాను. జాలి, దయ, నిజాయితీని వదిలేసి సంపద, అధికారం వెంబడి పరుగెత్తేలా ప్రలోభపెడతాను.

* విడగొడుతా.. ఒంటరిగా మారుస్తా

కోపం, అపార్థాల ద్వారా ప్రజలను ఒకరికొకరు కొట్టుకునేలా విభజిస్తాను. ద్వేషాన్ని నింపి సమాజాలను బలహీనపరిచి, వ్యక్తులను ఒంటరిగా చేస్తా. తద్వారా వారు దేవుడిని లేదా ఇతరుల మద్దతును వెతకడం తగ్గిస్తారు.

* సత్యాన్ని మార్చేస్తా

తప్పు, ఒప్పు మధ్య ఉన్న గీతలను అస్పష్టం చేసి.. ఏది పవిత్రమైనది కాదని ఒప్పించేందుకు ప్లాన్ చేస్తా. సత్యం సబ్జెక్టివ్ అని నమ్మించడం ద్వారా దైవిక లేదా నైతిక సూత్రాలపై వారి నమ్మకాన్ని క్షీణింపజేసి.. స్వార్థపూరితంగా మార్చేస్తా.

* తప్పుడు దేవతలను తీసుకొస్తా..

ఆధ్యాత్మిక తృప్తికి ప్రత్యామ్నాయాలను వెతుకుతా. పేరు, సాంకేతికత, లేదా భావజాలం వంటి విగ్రహాలను అందిస్తాను. ఇవి సంతోషాన్ని వాగ్దానం చేస్తాయి. కానీ ప్రజలను ఖాళీగా వదిలివేస్తాయి. శాశ్వత శాంతి కంటే తాత్కాలిక ఆనందాలను వెంబడించేలా చేస్తాయి. ఆధ్యాత్మిక సంబంధం అసంబద్ధంగా, అసాధ్యంగా అనిపించే వాతావరణాన్ని సృష్టిస్తాను. విశ్వాసాన్ని పాతబడినదిగా, అపరాధ భావనను ఒత్తిడిగా, ప్రార్థనను ఉపయోగరహితంగా భావించేలా చేస్తాను. అదే సమయంలో నేను బాధ్యత లేని స్వేచ్ఛను అందించే విముక్తిదాతగా కనిపిస్తాను.

కానీ ఈ ఊహాత్మక సైతాన్‌కు కూడా తెలుసు మానవులకు స్థితిస్థాపకత ఉంది. చీకటి సమయాల్లో కూడా ఆశ, ప్రేమ, లక్ష్యాన్ని తిరిగి కనుగొనగల సామర్థ్యం ఉంది. ఈ ప్రణాళిక ఎప్పటికీ పూర్తిగా విజయవంతం కాదు. ఎందుకంటే ప్రజలలోని దైవిక, మంచి ఆలోచనలు ఎల్లప్పుడూ వారిని తిరిగి దారిలోకి తీసుకురాగలదు.



Next Story

Most Viewed