- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పార్టీ ఫిరాయింపుల కేసు.. పిటిషన్లను కొట్టివేయాలని కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఈరోజు సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. గతంలో కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ మేరకు.. స్పీకర్ తరఫున నిన్న సాయంత్రం అసెంబ్లీ సెక్రటరీ (Assembly Secretary) సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు (Counter filing) చేశారు. అందులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ (Speaker) సరైన నిర్ణయం తీసుకోలేదు అనడం సరైందికాదని అనర్హత చట్టం (Disqualification Act) ప్రకారం స్పీకర్ నడుచుకుంటున్నారని తెలిపారు. అలాగే ఈ వ్యవహారంలో పిటిషనర్లు (Petitioners) దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని.. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల ఇష్యూపై స్పీకర్‌ను ఆశ్రయించిన వెంటనే వారు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. అలాగే దురుద్దేశంతో పార్టీ ఫిరాయింపులపై వేసిన పిటిషన్లను కొట్టివేయాలని (dismiss the charges) సుప్రీంకోర్టులో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి (Telangana Assembly Secretary) కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కాగా ఈ వ్యవహారంపై నేడు విచారణ జరగనుండగా కోర్టు తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.