- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. మంత్రివర్గ ఉపసంఘం భేటీపై నారా లోకేష్

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కూటమి నేతలు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఓ వైపు రాష్ట్రంలో ఖాళీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి చేస్తునే.. మరో వైపు పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు వినూత్న పాలసీలను ప్రవేశపెడుతున్నారు. అంతేగాక రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ అధ్యక్షతన మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మంత్రి వర్గ ఉపసంఘం ఉండవల్లిలోని నివాసంలో రెండవసారి సమావేశం అయ్యింది. దీనిపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన.. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ.8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించినట్లు తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్ పోర్టల్ ను సమర్థంగా తీర్చిదిద్దాలని.. భూకేటాయింపులు, అనుమతులకు సంబంధించిన అన్ని వివరాలు ట్రాకర్ లో పొందుపర్చాలని అధికారులకు ఆదేశించానని చెప్పారు. అంతేగాక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ప్రతిబంధకంగా మారిన విధానాలను సంస్కరిస్తామని తెలియజేయడంతో పాటు ఎంఎస్ఎమ్ఈలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు.