Google photos: గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఈ సూపర్ ఫీచర్ల గురించి మీకు తెలుసా?

by D.Reddy |
Google photos: గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఈ సూపర్ ఫీచర్ల గురించి మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ (Google) సంస్థకు చెందిన గూగుల్ ఫొటోస్ (Google photos) యాప్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఫొటోలు, వీడియోలను సేవ్, షేర్‌, ఎడిట్ చేసుకునేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌ను వినియోగిస్తుంటారు. స్మార్ట్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను ఈమెయిల్‌తో సింక్ చేసి ఈ యాప్‌లో భద్రపర్చుకుంటారు కూడా. అయితే, ఇందులో ఉన్న కొన్ని సూపర్ ఫీచర్ల గురించి మనలో చాలా మందికి తెలియదు. అవేంటో తెలుసుకుందాం.

గూగుల్ ఫొటోస్‌లో స్టోర్ చేసిన ఫొటోలను ఏఐ టూల్స్ (Tools) ఉపయోగించి ఎడిట్ చేసుకోవచ్చు. అదేలాగంటే.. ముందుగా యాప్ ఒపెన్ చేసి, ఏదైనా ఫొటోను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఫొటో ఎడిటింగ్‌కు సంబంధించిన చాలా టూల్స్ అందుబాటులో ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ బ్లర్ చేసుకోవటం, ఫొటోలో అవసరం లేని వస్తువులను ఎరేజ్ చేసుకోవటం వంటి తదితర ఫీచర్లు ఉంటాయి.

అలాగే, సినిమాటిక్ ఫీచర్ (Cinematic feature) ఉపయోగించి మన ఫొటోలకు రియలిస్టిక్‌ సినిమాటిక్ లుక్ తీసుకురావచ్చు. సాధారణ ఫొటోలను మూవింగ్ ఫొటోస్‌గా కూడా మార్చవచ్చు. యాప్ ఒపెన్ చేయగానే రైట్ సైడ్ ప్లస్ (+) గుర్తు ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే సినిమాటిక్ ఫొటో అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి మనకు నచ్చిన ఫొటోలను మరింత ఆకర్షణీయంగా ఎడిట్ చేసుకోవచ్చు.

ఇక కొంత మంది గూగుల్ ఫొటోస్‌లో ఉన్న ఫొటోలను కూడా ఎవరి కనిపించకుండా పెట్టుకోవాలనుకుంటారు. అలాంటి వారు యాప్ ఓపెన్ చేసి ప్రైవసీలో పెట్టాలనుకునే ఫొటోను ఎంచుకోని పైకి స్క్రోల్ చేయాలి. మూవ్ టూ లాక్డ్ ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, ఆ ఫొటో హైడ్ అవుతుంది. తిరిగి దాన్ని చూడాలనుకుంటే సెర్చ్ బార్‌లోకి వెళ్లి లాక్డ్ ఫోల్డర్ అని టైప్ చేస్తే హైడ్ చేసిన ఫొటోలు కనిపిస్తాయి.

Next Story