Jeevan Reddy: మోకిలా పీఎస్‌కు మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి.. ఆ కేసులో విచారణకు హాజరు

by Shiva |
Jeevan Reddy: మోకిలా పీఎస్‌కు మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి.. ఆ కేసులో విచారణకు హాజరు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఇవాళ రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మోకిలా పోలీస్ స్టేషన్‌ (Mokila Police Station)కు హాజరయ్యారు. మెకిలాలో114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఆయనపై ఆ భూ యజమాని సామ దామోదర్ రెడ్డి (Sama Damodar Reddy), మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై మోకిలా (Mokila)తో పాటు చేవెళ్ల (Chevella) పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో జీవన్ రెడ్డి కేసులో ముందస్తు బెయిల్‌తో పాటు.. తనను, తన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకూడదంటూ సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం అరెస్ట్‌ నుంచి మినహాయింపునిస్తూ.. కేసులో విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన విచారణ నిమిత్తం మోకిలా (Mokila) పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు.

Next Story

Most Viewed