బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ : నిర్మల జగ్గారెడ్డి

by Aamani |
బడుగు బలహీన వర్గాల  ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ : నిర్మల జగ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి : బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధ్యక్షతన బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 315 వ, వర్ధంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విపరీతమైన పన్నుల భారం సామాన్యులపై మోపుతున్న నిరంకుశ పాలన సాగించిన పాలకులపై బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి సైన్యం ను ఏర్పాటు చేసి మొగల్ సామ్రాజ్యం పై ఎదురు తిరిగి తన ప్రాంతానికి స్వతంత్రం తెచ్చుకున్న ఘనత సర్దార్ సర్వాయి పాపన్న ది అని నిర్మల జగ్గారెడ్డి అన్నారు.

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ సామాన్య ప్రజలపై మొగల్ సైనికుల మొగల్ పాలకుల అరాచకాలను నిరసిస్తూ సామాన్య ప్రజలను ఏకం చేసి తిరుగుబాటు చేసి తన ప్రాంతానికి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బడుగు బలహీన వర్గాలలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పణంగా పెట్టి మొగల్ సైనికులపై తిరుగుబాటు విషయమన్నారు.ఈ సందర్భంగా గౌడ కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పద్మజ రాణి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్,వివిధ సంఘాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed