- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Chandrababu:టీటీడీ పై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సచివాలయంలో ఈ రోజు(బుధవారం) సీఎం చంద్రబాబు(CM Chandrababu) టీటీడీ(TTD) పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత కారణంగా తిరుమల(Tirumala)లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమలలో పెండింగ్ అంశాలపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
శ్రీవారి దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవల పై భక్తుల(Devotees) నుంచి సేకరించిన అభిప్రాయాలను టీటీడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకదాశి వంటి ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల పై సీఎం మాట్లాడారు. శ్రీవారి లడ్డు, అన్న ప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై టీటీడీ అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. గ్యాలరీల్లో సౌకర్యాల్లో పెంపు, మరింత మంది భక్తులకు కల్పించేలా.. మాడవీధుల్లో ఏర్పాట్లను అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “తిరుమల దేవాలయంలో సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వానికి నేటికీ ఇప్పటికే మార్పు కనిపించింది. అయితే ఆ మార్పు 100 శాతం ఉండాలి. అప్పుడే భక్తుల, ప్రజల అంచనాలను మనం అందుకోగలం. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి. ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలి.
శ్రీవారి డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దు. మనం దేవాలయానికి ధర్మకర్తలం, నిమిత్తమాత్రులం మాత్రమే. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకల సొమ్మును ఇష్టారీతిన ఖర్చుపెట్టే అధికారం ఎవరికీ లేదు. ఏడుకొండల వాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు. వందల కోట్ల నిధులను అనేక కార్యక్రమాలకు టీటీడీ ఖర్చు చేస్తోంది. దీనిపై ఇంటర్నల్ ఆడిటింగ్ తో పాటు.. కాగ్ ద్వారా ఆడిట్ జరిపితే మంచిది. భక్తులు ఇచ్చే వితరణ, విరాళాలు ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు అవ్వాల్సిన అవసరం ఉంది. జవాబు దారీతనం ఉండాలి” అని సీఎం స్పష్టం చేశారు.
అలిపిరిలో ఉన్న భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధికి ప్రణాళిక అమరావతిలో శ్రీవారి ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో వీటికి సంబంధించిన నమూనాలను పరిశీలించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), ఈఓ శ్యామలరావు(EO Shyamala Rao), జేఈవో వెంకన్న చౌదరి(JEO Venkanna Chowdary) తదితర అధికారులు హాజరయ్యారు.