సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

by Ramesh Goud |
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Dubbaka MLA Kotha Prabhakar Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revath Reddy) ని కలిశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గమైన దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skill University) ని ఏర్పాటు చేయాలని సీఎంను బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) కోరారు. దీనిపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అంతేగాక యూనివర్సిటీ నెలకొల్పేందుకు కావాల్సిన స్థల పరిశీలనకు దుబ్బాక వెళ్లాలని సీఎంఓ (CMO) కు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తోంది. అలాగే దుబ్బాక నియోజకవర్గం (Dubbaka Constiency)లో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హబ్సీపూర్- లచ్చపేట్ (Habsipur -Lachapet) కు రెండు వరుసల రోడ్డు (Double Road) నిర్మాణానికి రూ. 35 కోట్లు మంజూరు చేశారు. దీనికై సీఎం రేవంత్ రెడ్డికి దుబ్బాక ఎమ్మెల్యే ధన్యవాదాలు (Thanks) తెలియజేశారు.



Next Story

Most Viewed