విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అకస్మిక మృతి

by Naveena |   ( Updated:2025-01-06 11:57:16.0  )
విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అకస్మిక మృతి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేష్ అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారు. వివరాల్లోకి వెళ్ళితే..జిల్లా కేంద్రంలోని జైలు నుండి ఖైదీని కోర్టులో హాజరు పరచి తిరిగి బయటకు వస్తున్న తరుణంలో 3274 పీసీ నెంబర్ కానిస్టేబుల్ కె.వెంకటేష్ (45) ఛాతీలో నొప్పితో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ మిగతా సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్ళగా..పరీక్షించిన డాక్టర్లు అప్పటికే గుండెపోటు తో మరణించినట్లు ధృవీకరించారు. విధుల్లో అకస్మాత్తుగా మరణించిన కానిస్టేబుల్ వెంకటేష్ మృతికి జిల్లా ఎస్పీ జానకి తీవ్ర సంతాపం ప్రకటించారు.వెంకటేష్ ఆత్మకు శాంతి చేకూరాలని,ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story