Norway PM On Elon Musk: మస్క్‌ పై నార్వే ప్రధాని ఆగ్రహం.. ఎందుకంటే?

by Shamantha N |   ( Updated:2025-01-06 11:13:37.0  )
Norway PM On Elon Musk: మస్క్‌ పై నార్వే ప్రధాని ఆగ్రహం.. ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై నార్వే ప్రధాని జోనాస్ గహ్ స్టోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల రాజకీయాల్లో వేలు పెడుతున్నారని మండిపడ్డారు. అమెరికా బయటి దేశాల రాజకీయాల్లో మస్క్ జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. "సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకునే సౌకర్యం, భారీగా ఆర్థిక వనరులను కలిగి ఉన్న వ్యక్తి ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో నేరుగా పాల్గొనడం నాకు ఆందోళన కలిగిస్తుంది" అని స్టోరే నార్వేజియన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ కి వెల్లడించారు. "ప్రజాస్వామ్యాలు, వాటి మిత్రదేశాలకు ఇది మంచిది కాదు అని వ్యాఖ్యానించారు. మస్క్ నార్వే దేశ రాజకీయాల్లో నిమగ్నం కావాలని చూస్తున్నారని అన్నారు. నార్వే దేశ రాజకీయనాయకులు అలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలని హితవు పలికారు.

Advertisement

Next Story