CDRI: సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో సైంటిస్ట్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

by Maddikunta Saikiran |
CDRI: సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో సైంటిస్ట్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(UP) రాష్ట్రం లక్నో(Lucknow)లోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CDRI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 18 సైంటిస్ట్(Scientist) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cdri.res.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 6 నుంచి అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 17 ఫిబ్రవరి 2025.

పోస్టులు, ఖాళీలు:

సైంటిస్ట్ - 18

విద్యార్హత:

సంబంధిత రంగాలలో అవసరమైన అర్హతలు, పరిశోధన అనుభవాన్ని కలిగి ఉండాలి.

వయోపరిమితి:

7 ఫిబ్రవరి 2025 నాటికి 32 ఏళ్లకు మించి ఉండకూడదు.

జీతం:

సైంటిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 67,000 నుంచి రూ. 1,27,766 వరకు జీతం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed