Tirumala: వీఐపీ దర్శనాలపై టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన

by srinivas |
Tirumala: వీఐపీ దర్శనాలపై టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి వైకుంట ద్వార దర్శన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టి ఉంచుకుని టీటీడీ(TTD) అన్ని సౌకర్యాలు రెడీ చేస్తోంది. క్యూ లైన్లలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న ఈ దర్శనాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) ప్రత్యేకంగా దృష్టి సారించారు. శ్రీవారి దర్శన టోకెన్ల కౌంటర్ల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. స్వయంగా ఆయనే కౌంటర్ల వద్దకు వెళ్లి పర్యవేక్షిస్తున్నారు.

తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న టోకెన్ల కౌంటర్లను శనివారం ఆయన పరిశీలించారు. తోపులాట లేకుండా టోకెన్లు జారీ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే వీఐపీలకు మాత్రం ఎలాంటి ప్రాధాన్యత ఉండదని తెలిపారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని, వారిని అనుగుణంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయం ద్వారాలన్నీ తెరిచే ఉంటాయని చెప్పారు. తిరుపతిలో మొత్తం 9 కేంద్రాల్లో 91 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 9న ఉదయం 5.30 గంటలకు అన్ని కౌంటర్లలో శ్రీవారి ద్వారా దర్శన టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed