Winter: చలికాలంలో కుక్కలతో జాగ్రత్త.. లేదంటే ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉందంటున్న నిపుణులు

by Prasanna |
Winter: చలికాలంలో కుక్కలతో జాగ్రత్త.. లేదంటే ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉందంటున్న నిపుణులు
X

దిశ, వెబ్ డెస్క్ : చలికాలంలో కుక్కలు పిల్లలను కంటూ ఉంటాయి. ఈ కాలంలోనే చాలా మంది కుక్క కాటుకు గురవుతుంటారు. కేసులు కూడా ఎక్కువగా నమోదవుతుంటాయి. కుక్క కాటుకు గురైన వారు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి. లేదంటే సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. దీని వలన అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ కుక్కలు వాహనాలను వెంబడిస్తుంటాయి. రంగు, రూపాన్ని బట్టి వాటిని లక్ష్యంగా చేసుకుంటాయి.

ప్రస్తుతం, మనుషులపై కుక్కలు బాగా దాడి చేస్తున్నాయి. సంతానోత్పత్తి తర్వాత కుక్క, తన పిల్లలలను కాపాడుకోవడానికి మనుషులను కురుస్తాయని వైద్యులు చెబుతున్నారు. హాస్పిటల్లో ఇలాంటి కేసుకులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కుక్కకాటు వల్ల రేబిస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే, వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. దీనిని తగ్గించడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉచితంగా యాంటీ రేబిస్ ఇంజక్షన్ అందించబడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed