- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Routines : మరుసటి రోజు మూడ్ బాగుండటం లేదా..? ఈ పొరపాట్లే కారణం కావచ్చు!
దిశ, ఫీచర్స్ : పొద్దున్న లేవగానే ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తారు కొందరు.. నిరాశా, నిస్పృహలతో, ఏదో తెలియని ఆందోళనతో నిద్ర మేల్కొంటారు మరికొందరు. సాయంత్రం నుంచి రాత్రి పడుకునే వరకు హ్యాపీగా ఉంటారు కొందరు. మరుసటి రోజు మాత్రం మూడ్ ఆఫ్ అయిపోతారు! ఎందుకలా? అంటే.. ముందు రోజు రాత్రి మీరు చేసే పొరపాట్లే అందుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నిద్రకు ముందు మీరు తీసుకునే ఆహారాలు, పానీయాలు, అతి ఆలోచనల తీరు మానసిక స్థితిలో మార్పునకు కారణం అవుతాయని, దీంతో మరుసటిరోజు ఉదయం బ్యాడ్ మూడ్‌తో నిద్ర మేల్కొనేలా చేస్తాయి. దీంతో స్ట్రెస్, యాంగ్జైటీ, కోపం వంటివి పెరుగుతాయి. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అయితే పరిస్థితికి ముఖ్యమైన కారణాలేమిటి? ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం.
సరైన ఆహారం తీసుకోకపోవడం..
చాలా మంది రాత్రి భోజనం చాలా లేటుగా తింటుంటారు. అయితే పడుకోవడానికి కనీసం గంట ముందు భోజనం చేయాలి. అలాగే మీరు తీసుకునే రాత్రి భోజనం, ఆహార పదార్థాలు సరైనవి కాకుంటే కూడా మరుసటి రోజు ఉదయం మీరు బ్యాడ్ మూడ్‌తో నిద్రమేల్కొనే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక కొందరికైతే రాత్రి భోజనం తర్వాత స్వీట్లు, చిప్స్, స్పైసీ స్నాక్స్ వంటి చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల కూడా మూడ్ పాడవుతుంది. ఎందుకంటే వీటిలో కార్బొహైడ్రేట్లు అధిక మోతాదులో ఉంటాయి. పడుకునే ముందు తినడంవల్ల నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. కానీ మరుసటిరోజు మీ మూడ్ పాడు చేస్తాయి. కోపంతోనో, చిరాకుతోనో, బద్ధకంతోనో మేల్కొనేలా చేస్తాయని న్యూట్రిషనల్ థెరపిస్ట్‌లు అంటున్నారు. కాబట్టి నిద్ర పోయేకంటే రెండు గంటలు, కనీసం గంట ముందే హెల్తీ ఫుడ్స్ తినాలని నిపుణులు సూచిస్తు్న్నారు. ఒకవేళ చిరుతిళ్లు ఒకటి రెండు తినాలనుకున్నా పడుకునే ముందు మాత్రం అసలు తినకండి. దీనివల్ల మరుసటి రోజు బద్ధకం ఆవహిస్తుంది.
మెగ్నీషియం లోపం
మీరు తినే ఆహారంలో మెగ్నీషియం లోపించడం కూడా బ్యాడ్ మూడ్‌కి కారణం అవుతుంది. కొందరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు కానీ.. వాస్తవానికి మీ దిన చర్య ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి తగిన మెగ్నీషియం అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు రోజూ తీసుకునే ఆహారం ద్వారానే ఇది లభిస్తుంది. అందుకే మీరు తింటున్న ఆహారంలో మెగ్నీషియం కలిగివి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీ డిన్నర్‌లో కొన్ని ముదురు రంగు కూరగాయలను(dark-colored vegetables) చేర్చడం, అంటే సాధారణంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు వంటివి ఉండేలా చూసుకోవాలి. మెగ్నీషియం తగిన సాంద్రతలో మెయింటెన్ చేయడానికి ఇవి చాలా అవసరం. ఎప్సన్ ఉప్పుతో(Epson salt) స్నానం చేయడం కూడా మీరు మెగ్నీషియం పొందడానికి చిన్నపాటిగా సహాయపడుతుంది.
ఆల్కహాల్ సేవించడం
బీరు మితంగా తీసుకుంటే మంచిదని చెప్తారు. కానీ ఆల్కహాల్ మాత్రం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. తరచుగా మద్యం తాగితే కాలేయం, మూత్ర పిండాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా నిద్రకు ముందు మద్యం సేవించడం మరుసటిరోజు నిద్ర మేల్కొనే తీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. అంటే బద్ధకంతో ఉంటారు. ఈ పరిస్థితి ఆ రోజంతా కొనసాగుతుంది. టూ మచ్ ఆల్కహాల్ లివర్‌పై అధిక ఒత్తిడిని పెంచడం ద్వారా క్రమంగా దానిని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆల్కహాల్ మీరు ఊహించని రీతిలో మానసిక ఆందోళనను, భావోద్వేగాలను పెంచుతుంది. కాబట్టి మద్యం తాగడం మానేస్తే బెటర్. అది సాధ్యం కానప్పుడు తక్కువ హ్యాంగోవర్‌తో మేల్కొనడానికి తక్షణ పరిష్కారం ఏంటంటే.. పడుకునే ముందు కొంచెం విటమిన్ సి లభించే పండ్లు గానీ, పదార్థాలు గానీ తినాలి.
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం
మీరు బ్యాడ్ మూడ్‌లో మేల్కొన్నప్పుడు, ఆ కోపాన్ని మీ కడుపుపై చూపొద్దు అంటున్నారు నిపుణులు. అంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుండా ఉండకండి. ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారు ఉదయంపూట బ్రేక్ ఫాస్ట్‌ను అస్సలు స్కిప్ చేయవద్దు. ఎందుకంటే అసలే నిరాశతో మేల్కొన్న మీరు దీనివల్ల మరింత ఎక్కువగా నిరాశ, నిస్పృహ, ఆందోళనలకు గురవుతారు. కాబట్టి తేలికైన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే ఆరోజు మీ మానసిక స్థితిని ఆనందమయం చేస్తుంది. అంటే తినకుండా ఉండటం అనేది కూడా మరుసటిరోజు మీ మూడ్ పాడవడానికి కారణం అవుతుంది. ఉదయాన్నే తగిన ప్రొటీన్లు కలిగిన బ్రేక్ ఫాస్ట్ చేయడంవల్ల ఆరోజంతా చాలా మంచి అనుభూతి చెందుతారు. అధిక బరువు తగ్గడానికి, ఎనర్జీ కోసం కూడా ఇది అవసరం.
రొటీన్‌కు భిన్నంగా..
రాత్రిపూట నిద్రపోవడం రొటీన్‌లో భాగం. కానీ ఎంత ప్రయత్నించినా కంటిమీద కునుకు రాని సందర్భాలను మీరు అనుభవిస్తున్నారా? ఎట్లయినా సరే నిద్రపోవాలనే ప్రయత్నంలో భాగంగా కళ్లు మూసుకున్నా లాభం లేకుండా పోతోందా? రకరకాల ప్రతికూల ఆలోచనలు వెంటాడుతుంటాడుతున్నాయా? మనం మరుసటి రోజు బ్యాడ్ మూడ్‌తో మేల్కొనడానికి ఇది కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు. వీటితోపాటు పడుకునే ముందు స్ర్కీన్‌లను చూడటం కారణంగా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజూ ఏదో తెలియన ఆందోళన, బద్ధకంతో నిద్రమేల్కొనేందుకు, మూడ్ బాగోలేకపోవడానికి ఇవి కారణం అవుతాయి. కాబట్టి మీ మూడ్ పాడుచేసే డైలీ రొటీన్‌లను గుర్తించి అవాయిడ్ చేస్తే మరుసటి రోజు బ్యాడ్ మూడ్‌తో కాకుండా హ్యాపీగా ఉండే చాన్స్ ఉటుంది అంటున్నారు నిపుణులు.