Nara Lokesh:‘ప్రతి ఒక్కరూ RRRను ఆదర్శంగా తీసుకోవాలి’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-01-06 11:36:09.0  )
Nara Lokesh:‘ప్రతి ఒక్కరూ RRRను ఆదర్శంగా తీసుకోవాలి’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: దేశ చరిత్రలోనే ‘రతన్ టాటా’(Ratan Tata) పేరు ఓ బ్రాండ్ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. విలువలతో వ్యాపారం చేయాలని పదే పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి అని ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరంలో ఆయన విగ్రహం ఆవిష్కరించి మాట్లాడారు. రతన్ టాటా విగ్రహావిష్కరణలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడితో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ‘కంట్రీ ఫస్ట్’ అనే నినాదంతో టాటా ముందుకెళ్లారని, నష్టాల్లో ఉన్న కంపెనీలను లాభాల బాట పట్టించారని కొనియాడారు. టాటాను సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ స్థాయికి తీసుకెళ్లారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. రతన్ టాటా సేవలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు MLA రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.

సొంత నిధులతో RRR అనేక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మంత్రి లోకేష్ కొనియాడారు. ఉండి నుంచి జలపాలం లింక్ రోడ్డు అభివృద్ధి కార్యక్రమానికి రతన్ టాటా పేరు పెట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ RRRను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉండి నియోజకవర్గంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఇటీవల ఆధునీకరించిన ఉండి జెడ్పి హై స్కూల్ భవనంతో పాటు బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులను నేడు(సోమవారం) మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. హైస్కూల్ నుంచి గ్రామంలోకి రూ.18 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఎదురయ్యే సంక్షోభాలనే అవకాశాలు గా మార్చుకుని.. ముందుకు సాగాలని విద్యార్థులకు మంత్రి లోకేష్(Minister Nara Lokesh) సూచించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story