- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలి
దిశ, కామారెడ్డి : వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో ఆయన సమీక్షించారు. గత వేసవి కాలంలోని సమస్యలు దృష్టిలో ఉంచుకొని వచ్చే వేసవి లో త్రాగు నీటి సమస్యలు రాకుండా అద్దె బోర్లు పరిశీలించాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని,మురికి కాల్వల్లోని చెత్తను తొలగించాలని, మురికి కాలువల్లోని నీరు రోడ్ల పైకి రాకుండా చూడాలని తెలిపారు. వేసవిలో మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలన్నారు. ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయాలని తెలిపారు. నర్సరీల్లో మొక్కలను వందశాతం సంరక్షించాలని తెలిపారు. డ్రై డే ఫ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు వారి క్షేత్ర పర్యటనలో అన్ని అంశాలపై సమీక్షించాలని, పర్యవేక్షించాలని తెలిపారు.
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి..
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించిన అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై 96 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం అర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను వేగవంతం చేయాలని,ఇప్పటికే సర్వే చేసిన వివరాల్లో రూఫ్ వివరాలు, గోడల వివరాలు పరిశీలించాలని అన్నారు. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లు, దివ్యంగుల లబ్ధిదారులకు పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇళ్లు వివరాలు రేపటి లోగా సమర్పించాలని ఎంపీడీఓ లను కలెక్టర్ ఆదేశించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇండ్ల సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.