- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు
దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ మనుజే యోహనన్ తెలిపారు. విద్యాలయంలో ఉపాధ్యాయులు విద్యార్థినులకు వేధింపులకు గురి చేస్తున్నట్లు వచ్చిన ఘటనపై విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ మనుజే యోహనన్ మాట్లాడుతూ..గత కొద్ది రోజుల క్రితం నవోదయ విద్యాలయంలో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేసినట్లు వచ్చిన అభియోగం పై విద్యాలయం రీజినల్ కార్యాలయానికి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు సదరు ఉపాధ్యాయునికి కర్నాటక రాష్ట్రానికి అటాచ్ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్వాన్ విచారణ చేపట్టగా పూర్తి స్థాయి విచారణ నిమిత్తం మరో ముగ్గురు ఉపాధ్యాయులను కళాశాల నుండి తీసుకెళ్లినట్లు తెలిపారు. విచారణ కొనసాగుతుందని విద్యార్థుల వ్యక్తి గత భద్రతపై తల్లి దండ్రులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. విద్యార్థులకు పూర్తిగా విద్యాలయ సిబ్బంది,ఉపాధ్యాయుల బృందం అండగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల క్షేమమే మా బాధ్యత అని పేర్కొన్నారు.