Panama Canal: పనామా కెనాల్‌లో చైనా జోక్యం లేదు.. జోస్ రౌల్ ములినో

by vinod kumar |
Panama Canal: పనామా కెనాల్‌లో చైనా జోక్యం లేదు.. జోస్ రౌల్ ములినో
X

దిశ, నేషనల్ బ్యూరో: పనామా కెనాల్‌(Panama canal)ను చైనా నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో (Jos roul mulino) స్పందించారు. ట్రంప్ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, పనామా కెనాల్‌లో చైనా (China) జోక్యం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పనామా సిటీలో మీడియాతో మాట్లాడారు. ‘పనామా కాలువలో ఒక్క చైనా సైనికుడు కూడా లేడు. అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మీకు నచ్చితే కాలువను సందర్శించండి’ అని ట్రంపునకు సూచించారు. కాలువ పనామేనియన్, పనామేనియన్లకు చెందినదని స్పష్టం చేశారు. దీని గురించి చర్చ చేపట్టే ప్రసక్తే లేదని తెలిపారు. తైవాన్‌తో సంబంధాలను తెంచుకున్న తర్వాత 2017లో చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నామని, రెండు దేశాల మధ్య సంబంధాలు గౌరవ ప్రదంగా ఉన్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed