- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త..ఎస్సార్ నగర్‌లో మృతదేహం లభ్యం
దిశ, ఖైరతాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లారెడ్డి గూడ కు చెందిన వ్యాపారవేత్త విష్ణు రూపాని 45 అనే వ్యక్తి డిసెంబర్ 30న అదృశ్యం మైనట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరిగి 2025 జనవరి 1న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్ధ నగర్ బస్తీ లోని ఒక భవనం లో నుంచి దుర్వాసన వస్తుంది అని సాయంత్రం 4 గంటల సమయంలో స్థానికులు ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది.మృతదేహాన్ని పరిశించిగా పంజాగుట్ట మిస్సింగ్ కేసులో ఉన్న విష్ణు రూపని గా నిర్ధారించారు.పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ మాట్లాడారు మృతి చెందిన వ్యక్తిపై ఎలాంటి గాయాలు లేవని అన్నారు.మృతదేహం లభ్యమైన చోట స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు సమాచారం.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్య జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.