చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : పోలీసు కమిషనర్

by Kalyani |
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : పోలీసు కమిషనర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ హెచ్చరించారు. జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనా మాంజాతో మనుషుల తో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజా తో తలెత్తే అనర్ధాలు పై అందరికీ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని అన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని అన్నారు. చైనా మాంజా ను అమ్మినా, రవాణా చేసినా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లకు గానీ, డయల్ 100 గానీ, ఫోన్ చేసి తెలపాలని పోలీసు కమిషనర్ అనురాధ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed