- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పరిగి టు గోరిట్లకు పావురం ఎగిరేనా..?
దిశ, పరిగి : ట్యాగులతో ఉన్న పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా స్థానికులు వాటిని పట్టుకున్నారు. ఈ సంఘటన పరిగి మున్సిపల్ పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. పరిగి లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో తెచ్చిన పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా స్థానికులు గుర్తించారు. ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా 20 బాక్సులలో సుమారు 300 పావురాలు ఉన్నట్లు గుర్తించారు. రెండు బాక్సులలోనీ 40 పావురాలను ఆకాశంలోకి వదిలారు. వాకింగ్ చేస్తున్న పరిగి స్థానిక వ్యక్తులు మా ప్రాంతానికి తెచ్చి ఇక్కడ పావురాలను ఎందుకు వదులుతున్నారు అంటూ నిలదీశారు.
అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా పావురాలను, ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు. పావురాల బాక్సుల పై కోడ్ నంబర్లు, పావురాల కాళ్లకు కోడ్ నెంబర్లు ఉండటంతో పోలీసులు జానీ, బాబు, మూనావర్ వారిని విచారించారు. ఈ పావురాలను సత్యసాయి జిల్లా గోరిట్ల గ్రామానికి చెందినవిగా మునావర్, బాబు, జానీలు తెలిపారు. ఈ పావురాలను గాలిలోకి వదిలితే గోరుట్లకు ఏ పావురం ముందు వస్తాయో ఆ పావురాల యజమానులు పోటీలో గెలిచినట్లు అని పావురాల ట్రైని మునావర్ తెలిపాడు. ఈ పావురాలు సుమారు 300 కి.మీ ప్రయాణం చేసేలా ట్రైనింగ్ ఇచ్చామని అందుకే వారి పందెంలో భాగంగా ఇక్కడ వదిలేందుకు వచ్చామని తెలిపాడు.