- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎప్పటికప్పుడు వార్తలు అందించడంలో దిశ దిక్సూచి...
దిశ, ఆర్మూర్ : అనతి కాలంలోనే పత్రికా రంగంలో దిశ దినపత్రిక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో దిశ దినపత్రిక 2025 నూతన సంవత్సర నిజామాబాద్ జిల్లా క్యాలెండర్ ను దిశ దినపత్రిక ప్రతినిధులతో, పలు పార్టీల నాయకులతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పత్రిక ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రజలకు అవసరమయ్యే అనేక వార్తలు రాస్తూ దిశ దినపత్రిక ప్రజలకు అత్యంత చేరువయ్యిందన్నారు. ఎప్పటి కప్పుడు వార్తలు రాయడంలో దిశ దినపత్రిక దిక్సూచి లాంటిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ దిశ దినపత్రిక ఇన్చార్జ్ ఇట్టేడి మోహన్ రెడ్డి, నందిపేట్ రిపోర్టర్ వినోద్, ఆలూరు రిపోర్టర్ సంజీవ్, నాయకులు పిప్రి రోహిత్ రెడ్డి, జెస్సు అనిల్ కుమార్, ద్యాగ ఉదయ్, పోల్కం వేణు తదితరులు పాల్గొన్నారు.