ట్రీట్మెంట్ సక్సెస్..బట్ పేషెంట్ డెడ్..సినిమా సీన్ రిపీట్..

by Aamani |
ట్రీట్మెంట్ సక్సెస్..బట్ పేషెంట్ డెడ్..సినిమా సీన్ రిపీట్..
X

దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా వైద్యం చేస్తున్నామన్న పేరుతో తమ వద్ద డబ్బులు వసూలు చేశారని, తీరా డబ్బులు చెల్లించాక చనిపోయిందని శవాన్ని చూపెట్టారని మృతురాలు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన బుధవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పేస్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మృతురాలు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. శేరిలింగంపల్లికి చెందిన ఎల్లమ్మ (60) లివర్ సమస్యతో గత రెండు రోజుల క్రితం స్పేస్ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. పేషంట్ అడ్మిన్ సమయంలో ఆమె బంధువులు రూ.2 లక్షల 20 వేల కట్టించుకున్న పేస్ హాస్పిటల్ యాజమాన్యం ఆమెకు లివర్ ఆపరేషన్ నిర్వహించారు.

ఆమె కోలుకుంటుందని, ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జి చేస్తామని స్పేస్ ఆస్పత్రి డాక్టర్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే బుధవారం ఉదయం ఎల్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని మరో రూ.3 లక్షలు చెల్లించాలని పేస్ హాస్పిటల్ సిబ్బంది సూచించారు. అయితే హాస్పిటల్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్లగా ఎల్లమ్మ చనిపోయిందని తెలిపారని, రూ.3 లక్షలు కడితేనే బాడీని ఇస్తామని హాస్పిటల్స్ సిబ్బంది భీష్మించుకు కూర్చున్నారని ఎల్లమ్మ బంధువులు ఆరోపిస్తున్నారు. స్పేస్ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఎల్లమ్మ చనిపోయిందని, ఎల్లమ్మ మృతికి వారే కారణం అంటూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని, ముందే చనిపోయిన డబ్బుల కోసం చికిత్స చేస్తున్నట్లు యాక్టింగ్ చేశారని ఎల్లమ్మ బంధువులు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed