Plane Crash: మరో ఘోర విమాన ప్రమాదం.. 28 మంది దుర్మరణం

by Gantepaka Srikanth |
Plane Crash: మరో ఘోర విమాన ప్రమాదం.. 28 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: మరో ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ కొరియా ఎయిర్ పోర్టు(South Korea Airport)లో ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 28 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరి కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 175 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బ్యాంకాక్(Bangkok) నుంచి ముయాన్ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బందికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Advertisement
Next Story